జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. సిడబ్ల్యుసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటి కుంగిన బ్యారేజ్ పియర్స్ ను పరిశీలించింది. ఉదయం 8:30 కు L&T క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న నిపుణుల బృందం అల్పాహారం ముగించుకుని తొమ్మిదిన్నరకు బ్యారేజ్ పైకి చేరుకున్నారు. 9:30 నుండి 1:30 వరకు సుమారు నాలుగు గంటల పాటు బ్యారేజీ లోని 7 వ బ్లాక్ లోని దెబ్బతిన్న,పగుళ్ల వచ్చిన 18 నుండి 21 పియర్లను పరిశీలించారు. కుంగిన పిల్లర్ల వద్ద బ్యారేజీ పై నుండి పరిశీలించి బ్యారేజీ కుడి, ఎడమవైపు రెండు వైపులా కిందికి దిగి పూర్తిగా అనలైజేషన్ చేసుకున్నారు. ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ NDSA నిపుణుల బృందం లంచ్ తర్వాత అన్నారం సరస్వతీ బ్యారేజీని, రేపు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనున్నట్టు సమాచారం.
Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా..
నిన్న హైదరాబాద్ జలసౌధలో ఈ నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో (Uttam Kumar Reddy) సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని కోరారు. మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని నిపుణుల బృందం చెప్పినట్లు వెల్లడించారు. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కోరినట్లు వివరించారు.