పార్లమెంట్ హౌస్‌లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎన్డీఏ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో ఉన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. వేదికపై ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తదితరులున్నారు. ఈ సందర్భంగా నితీష్, చంద్రబాబుతో ప్రధాని మాట్లాడుతున్న దృశ్యం కూడా కనిపించింది. ఈ సమావేశంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్,చంద్రబాబు నాయుడు, హేమమాలిని, కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు నేతలు భేటీలో ఉన్నారు. సభ ప్రారంభానికి ముందు జేపీ నడ్డా.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు సహా పలువురు నేతలకు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు.
READ MORE: Sudan: సూడాన్‌లోని వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ ఫోర్సు దాడి..దాదాపు 150 మంది మృతి
ఈ భేటీలో నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మధ్య భిన్నమైన కెమిస్ట్రీ కనిపించింది. పార్లమెంటరీ పార్టీ సమావేశం మధ్యలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌లతో పాటు బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా వేదికపై ఉన్నారు. ఇంతలో బీహార్ సీఎం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు చెవికొరుక్కున్న దృశ్యం కనిపించింది. సమావేశానికి చేరుకున్న చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానిని ఎన్నుకోవడం లాంఛనమే అన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేశామని.. ఆయన నాయకత్వంలో వరుసగా మూడోసారి అఖండ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. ఇంకా మీటింగ్ కొనసాగుతోంది.