Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nda Mps Meeting Begins Pawan Kalyan And Chandrababu On Stage

DELHI: ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం.. వేదికపై పవన్ కల్యాణ్, చంద్రబాబు

Published Date :June 7, 2024 , 12:23 pm
By RAMAKRISHNA KENCHE
DELHI: ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం.. వేదికపై పవన్ కల్యాణ్, చంద్రబాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్లమెంట్ హౌస్‌లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎన్డీఏ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో ఉన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. వేదికపై ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తదితరులున్నారు. ఈ సందర్భంగా నితీష్, చంద్రబాబుతో ప్రధాని మాట్లాడుతున్న దృశ్యం కూడా కనిపించింది. ఈ సమావేశంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్,చంద్రబాబు నాయుడు, హేమమాలిని, కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు నేతలు భేటీలో ఉన్నారు. సభ ప్రారంభానికి ముందు జేపీ నడ్డా.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు సహా పలువురు నేతలకు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు.

READ MORE: Sudan: సూడాన్‌లోని వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ ఫోర్సు దాడి..దాదాపు 150 మంది మృతి

ఈ భేటీలో నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మధ్య భిన్నమైన కెమిస్ట్రీ కనిపించింది. పార్లమెంటరీ పార్టీ సమావేశం మధ్యలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌లతో పాటు బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా వేదికపై ఉన్నారు. ఇంతలో బీహార్ సీఎం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు చెవికొరుక్కున్న దృశ్యం కనిపించింది. సమావేశానికి చేరుకున్న చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానిని ఎన్నుకోవడం లాంఛనమే అన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేశామని.. ఆయన నాయకత్వంలో వరుసగా మూడోసారి అఖండ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. ఇంకా మీటింగ్ కొనసాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • chandrababu
  • Delhi
  • LATEST TELUGU NEWS
  • Meeting

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions