NTV Telugu Site icon

Konathala Ramakrishna: పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. ఎన్డీయే కూటమిదే గెలుపు..!

Konathala

Konathala

విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.. దానికి లోకసత్తా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు.. జయ ప్రకాశ్ నారాయణకు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ఇక, ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి.. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయి.. వెనుకబడిన ప్రాంతం, వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర.. ఆదాయం తక్కువుగా ఉన్న ప్రాంతం.. ఉత్తరాంధ్ర అభివృద్ది సాధించాలంటే ప్రతి ఎకరాకు నీరు రావాలంటే.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి అని కొణతాల రామకృష్ణ వెల్లడించారు.

Read Also: Karnataka : పోలీసులపై కోపంతో స్టేషన్ పై గ్రామస్తుల దాడి.. 25 మంది అరెస్ట్

ఇక, గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడింది అని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. వంశధార, సుజల స్రవంతి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి.. తండ్రి మొదలు పెట్టిన ప్రాజెక్టులైనా.. కనీసం కొడుగుకుగా కూడా పూర్తి చేయలేకపోయాడు.. ఇది చాలా దురదృష్టకరం.. పోలవరం కూడా పెండింగ్ లోనే ఉంది. ఆల్రెడీ కట్టిన కాఫర్ డాం డ్యామేజ్ అయింది.. నిర్వాసితులకు కూడా డబ్బులు చెల్లించలేదు.. ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్ లో ఒక లెక్కలు.. ఖర్చుపెట్టినవి ఒక లెక్కలు అని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని చిన్న చూపు చూశారు.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇవ్వాలని కోరుతున్నాం.. ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతున్నారు.. మంచి రోజులు వస్తున్నాయని కొణతాల పేర్కొన్నారు.

Read Also: Actress Sukanya: విడాకులు తీసుకున్నా.. తను నా కూతురు కాదు!

కాగా, మోడీ సహకారంతో మన ప్రాంతాన్ని, అంధ్రా రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోబోతున్నామని కొణతాల రామకృష్ణ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ది కార్యక్రమాలు జరగాలనీ కోరుతున్నాం.. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది అన్నది ఎజెండాలో లేకుండా పోయింది.. ప్రభుత్వ డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు.. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత నష్టపోయామో.. అంతకు వంద రేట్లు ఈ ఐదేళ్లలో నష్టపోయాం.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అభివృద్ది లేదు.. ఇంకా వేరే జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆరోపించారు. కేఫ్టిల్ ఇన్వెస్ట్మెంట్ పది శాతం పైనే ఉండాలి.. కానీ ఆరు శాతం మించలేదు.. జ్యూట్ మిల్లులు సైతం కనుమరుగై పోయాయి.. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు అనేవి ప్రభుత్వ విధానాలపైన ఆధారపడి ఉంటాయి.. ఈ ప్రభుత్వంలో పదిసార్లకు పైనే విద్యుత్ చార్జీలు పెంచారు.. దీంతో అవి కూడా నష్టాల్లో ఉన్నాయి.. పాలన మొదలు పెట్టడమే విధ్వంసంతో పెట్టారని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపణలు చేశారు.

Show comments