NBK 109 :సరికొత్త పాత్రలో కనిపించబోతున్న బాలయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను మాస్ డైరెక్టర్ బాబీ తో చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకపై సూర్యదేవర నాగవంశీ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నాడు.దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ ఇటీవల నాగవంశీ అదిరిపోయే అప్‌డేట్ రివీల్ చేశాడు.
బాలకృష్ణ పాత్ర తో పాటు యాక్షన్ అంశాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో మ్యాడ్ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పేశాడు. గుంటూరు కారం తర్వాత మా బ్యానర్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీస్ లో బాలకృష్ణ, బాబీ సినిమా ఒకటని సూర్యదేవర నాగవంశీ తెలిపారు.. ఈ మధ్య కాలంలో అస్సలు టచ్ చేయని గెటప్, క్యారెక్టరైజేషన్ తో బాలకృష్ణ పాత్ర ఈ సినిమా లో కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని ఆయన తెలిపాడు.అయితే ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ బ్లాక్ ఎంతో కొత్తగా ఉంటుందని, బోయపాటి శ్రీను కూడా తన సినిమాల్లో టచ్ చేయని యాంగిల్ తో ఈ ఎపిసోడ్స్ సాగుతాయని తెలిపారు.మాస్ హిస్టీరియా ఉన్న హీరో అలాగే మాస్ డైరెక్టర్ కలిసి చేస్తోన్న ఈ సినిమాను ఆడియెన్స్ పూర్తి గా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు.బాలకృష్ణ, బాబీ మూవీపై సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!