సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత లవ్లీ కపుల్స్‌లో నయనతార – విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. పరస్పరం చూపుకునే ప్రేమ, గౌరవం, భావోద్వేగ బంధం కారణంగా ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నవంబర్ 19తో లేడీ సూపర్‌స్టార్ నయనతార 41వ ఏట అడుగుపెట్టగా, ఈ సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన్ ఆమెకు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార బర్త్ డే సందర్భంగా విఘ్నేశ్ శివన్ ఈసారి కూడా ఖరీదైన వాహనాన్నే బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం ప్రకారం, విఘ్నేశ్ నయనతారకు బహుమతిగా..
Also Read : Usha Uthup: నన్ను రునా లైలా అనుకున్నారు.. సెల్ఫీ కూడా తీసుకోలేదు
రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ అనే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఇచ్చారు. దీని అంచనా ధర సుమారు రూ.10 కోట్లు. ఈ కార్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సూపర్ లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా గుర్తింపు పొందింది. స్పోర్టీ లుక్, హై-ఎండ్ ఇంటీరియర్స్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కార్‌కి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. గత మూడు సంవత్సరాలుగా విఘ్నేశ్ శివన్ భార్యకు పుట్టినరోజు సందర్భంగా లగ్జరీ కారును బహుమతిగా ఇస్తూ వస్తున్నారు. 2023లో నయనతారకు రూ.3 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబాచ్ కార్‌ను గిఫ్ట్ చేశారు. 2024 లో రూ.5 కోట్ల బెంజ్ మేబ్యాక్ GLS 600 అందించారు. ఇక ఈ ఏడాది ఆ గిఫ్ట్ విలువను మరింత పెంచుతూ, దాదాపు డబుల్ ధరగల రోల్స్ రాయిస్‌ను అందించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొత్త కార్ ముందు నయన్ నిలబడి ఉన్న స్టిల్స్‌ను అభిమానులు షేర్ చేస్తూ, “ఇండస్ట్రీ బెస్ట్ కపుల్”, “నయన్ కి సరిపోయే గిఫ్ట్ ఇదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నయనతార ప్రస్తుతం పలు తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, విఘ్నేశ్ శివన్ తన తదుపరి దర్శకత్వ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నిర్మించిన “కా.అ.ప” తర్వాత కొత్త ప్రాజెక్టులకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.