Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Naxalites Are Fierce In Chhattisgarh Landmine Blast Two Jawans Injured

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు ఘాతుకం.. మందుపాతర పేలుడు, ఇద్దరు జవాన్లకు గాయాలు

Published Date :December 2, 2023 , 7:58 pm
By Rajesh Veeramalla
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు ఘాతుకం.. మందుపాతర పేలుడు, ఇద్దరు జవాన్లకు గాయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అయితే పోలీసులే లక్ష్యంగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలకు ముందు ఈ ఘటన జరగడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి విధ్వంసకర సంఘటనలు జరగకుండా.. చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..

వివరాల్లోకి వెళ్తే.. నక్సలైట్లు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా పలు చోట్ల బ్యానర్లు, పోస్టర్లు అంటించారు. వాటిని తొలగించేందుకు 195 బెటాలియన్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బార్సుర్‌పల్లి సమీపంలో పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. దీంతో తీవ్ర గాయాలైన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ కు కూడా గాయాలయ్యాయి. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !

కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో సహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిసెంబరు 2 నుంచి డిసెంబర్ 8 వరకు నక్సలైట్లు పీఎల్‌జీఏ వారోత్సవాల 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నక్సలైట్లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 నుండి 8 వరకు ఈ వారొత్సవాన్ని జరుపుకుంటారు. నక్సలైట్లు గెరిల్లా యుద్ధం కోసం 2000 సంవత్సరంలో PLGAని స్థాపించారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ప్రతి సంవత్సరం పీఎల్‌జీఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blast
  • Chhattisgarh
  • injure
  • jawans
  • landmine

తాజావార్తలు

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

  • David Miller: డ్రెస్సింగ్ రూమ్‌ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..

  • Oppo A6s Pro: 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌ విడుదల

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions