Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju Comments at Animal Movie Sucess Meet: రణ్‌భీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2023 మాకెంతో కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించటం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ ఏడాది ఇంకా హాయ్ నాన్నను కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. యానిమల్ సినిమా విషయానికి వస్తే సినిమా బాగా కనెక్ట్ కావటంతో తొలి రోజున మూవీ రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు పదిహేను కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈరోజు, రేపు కూడా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫస్ట్ వీకెండ్‌లో ముప్పై ఐదు నుంచి యాబై కోట్ల రూపాయల వరకు గ్రాస్ మార్క్‌ను యానిమల్ సినిమా అందుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ సక్సెస్‌ను టీమ్ ఎంతో ఎంజాయ్ చేస్తుంది. సినిమా గ్లోబల్ అయ్యిందనటానికి ఇదొక ఎగ్జాంపుల్. మన హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజయాలను సాధించాయి.
Nithin : ఆమె షూటింగ్‌కి రావడమే పెద్ద ఛాలెంజ్.. శ్రీలీలపై నితిన్ చురకలు!
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ఇప్పుడు అక్కడి హీరోలు సినిమాలను కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాలను చూడటానికి ఏమాత్రం ఆలోచించరని ప్రూవ్ అయ్యింది. ఇది సందీప్ వంగా మేకింగ్ స్టైల్. అనిమల్ తరహా చిత్రాలను నేను కూడా నిర్మిస్తాను. అయితే నేను సినిమాలు చేస్తే బొమ్మరిల్లు స్టైల్లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు కాబట్టి. నేను అనిమల్ వంటి సినిమాలు చేయాలంటే ముందుగానే డైరెక్టర్ ఇలాగే తీస్తాడని స్టేట్‌మెంట్ ఇచ్చి మరీ నిర్మిస్తాను అన్నారు. ఇక వచ్చే ఏడాది మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాం. అలాగే దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మూడు సినిమాలు చేస్తున్నాం. మొత్తంగా ఏడు సినిమాలను సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి ప్లాన్ చేసుకుంటున్నాం. గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే ఎనబై శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాజమౌళి, శంకర్, సుకుమార్, సందీప్ వంగా వంటి వారిని టైమ్ అడగకూడదు. శంకర్‌గారు ఆయన ప్లానింగ్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అంతా పూర్తయిన తర్వాత ఆయన పోస్ట్ ప్రొడక్షన్ సమయం చెప్పే దాన్ని బట్టి రిలీజ్ డేట్ చెబుదాం’’ అన్నారు.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!