Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
Navjot Kaur Sidhu: ప్రస్తుతం భారత రాజకీయాల్లో ఎక్కడ చూసినా రాఘవ్ చద్దా పేరే వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పిల్లర్ లాంటి రాఘవ్, అనూహ్యంగా బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం కొందరికి షాక్ ఇస్తే, మరికొందరిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అయితే, ఆయన ఎందుకు పార్టీ మారారు అనే విషయంపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రానే కారణమని నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు. “రాఘవ్ చద్దా తన సోదరి పరిణీతి చోప్రా భర్త కావడంతో ఆయనను కాపాడుకోవడానికి ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ వెనుక పడ్డారని, త్వరలోనే ఆయనపై ఈడీ (ED) దాడులు జరిగే అవకాశం ఉందని ప్రియాంకకు ముందే సమాచారం అందింది. అందుకే తన చెల్లెలి భవిష్యత్తు కోసం ఆమె రాఘవ్‌ను బీజేపీ వైపు మళ్లించారు” అని కౌర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, రాఘవ్ చద్దాకు పార్టీకి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయని నవజ్యోత్ కౌర్ సిద్ధూ తెలిపారు. పార్టీ కోసం రాఘవ్ మాట్లాడటం లేదని ఆప్ నాయకత్వం భావించిందని, ఆ క్రమంలోనే గొడవలు మొదలయ్యాయని ఆమె వివరించారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు అప్పుడే గళం విప్పాలని, నాలుగేళ్ల తర్వాత మాట్లాడటం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ రాజకీయ మార్పు రాఘవ్ సోషల్ మీడియా ఇమేజ్‌పై కూడా భారీ ప్రభావం చూపింది. బీజేపీలో చేరిన మరుసటి రోజే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 20 లక్షల (2 మిలియన్) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కోల్పోయారు. కునికా సదానంద్, ప్రకాష్ రాజ్ వంటి సెలబ్రిటీలు కూడా రాఘవ్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన ఈ ‘టాప్ సీక్రెట్’ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, పరిణీతి లేదా రాఘవ్ చద్దా స్పందించలేదు. ఇక ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఇదేనా? అనే ప్రశ్న జనాల్లో మొదలైంది. ఏది ఏమైనా, రాఘవ్ రాకతో బీజేపీ బలం పెరుగుతుందా లేదా ఆప్ దెబ్బతింటుందా అనేది మున్ముందు చూడాలి.
Also Read
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!