Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. ‘కేజీయఫ్ 2’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న యష్, ఈ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని భావించారు. అయితే, గత మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. మనకు తెలిసి యష్ తన సినిమాల విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. బహుశా అందుకే గ్రాఫిక్స్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం తీసుకుంటున్నారా అనే కోణం కూడా ఉంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం,
ఈ సినిమా విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం ఓటీటీ (OTT) ఒప్పందం ఇంకా పూర్తి కాకపోవడమేనని టాక్. మొదట గల్ఫ్ దేశాల్లోని పరిస్థితుల వల్ల మార్చి రిలీజ్ ఆపినట్టు చెప్పారు. కానీ ఇప్పుడు జూన్ విడుదలపై కూడా సందిగ్ధత నెలకొంది. మార్చిలో విడుదల చేయాలనుకున్నప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ చిత్రాలకు షూటింగ్ దశలోనే కోట్లలో ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతాయి. అలాంటిది ఓటీటీ సంస్థలు ఆశించిన ధర ఇవ్వడం లేదంటే, సినిమా అవుట్ పుట్ విషయంలో మేకర్స్ ఏమైనా కాన్ఫిడెన్స్ కోల్పోయారా? లేక యష్ భారీ రేటు డిమాండ్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నారని సమాచారం. జూన్ లో కూడా సాధ్యం కాకపోతే, ఆగస్టు లేదా దసరా సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ లోపు ఓటీటీ డీల్ క్లోజ్ చేసి, అధికారికంగా ప్రమోషన్స్ మొదలుపెడితే తప్ప ఫ్యాన్స్ కూల్ అయ్యేలా లేరు.
Also Read
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!