స్టార్ హీరోయిన్ అనుష్క జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించారు.యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో అనుష్క షెఫ్ గా అలాగే నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఈ సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల అవుతుంది.దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.తాజాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖ చేరుకుంది..చిత్ర బృందం.. విశాఖ హోటల్ గ్రీన్ పార్క్ లో మీడియా సమావేశం నిర్వహించింది.
ఆ సమావేశంలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ఇప్పటికే తమ సినిమా ట్రైలర్‌కి, ప్రొమోలకు మంచి స్పందన వచ్చింది.ఇందులో తాను స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో నటించానని తెలియజేశారు.నెల్లూరు, విజయవాడ,గుంటూరు జిల్లాలో మూవీ ప్రమోషన్ వర్క్ పూర్తి చేసినట్లు తెలియజేశారు.విశాఖలో ప్రమోషన్‌లో భాగంగా CMR షాపింగ్ మాల్ లో ఓ ఈవెంట్ అలాగే ఆర్ కె బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్ర ప్రమోషన్ వర్క్ ఉంటుందని తెలిపారు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ మహేశ్ విశాఖ వ్యక్తే అని నవీన్ తెలిపారు. చిత్రంలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్టైన్‌మెంట్ ఉంటుందనీ నవీన్ తెలిపారు..ఈ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా చూడాలని అన్నారు. కృష్ణాస్టమి పండగ సందర్బంగా విడుదల అవుతున్న మా సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నట్లు నవీన్ తెలియజేసారు.. తనకు హీరో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు.. అలాగే హీరోయిన్ అనుష్కతో కలిసి చేస్తాను అని చిన్నపుడు కల వచ్చిందని.. ఇప్పుడు ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉందని నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చారు