Love Mouli Trailer: నవదీప్ ‘లవ్ మౌళి’ ట్రైలర్.. బోల్డ్ కంటెంట్ బోలెడుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navdeep’s Love Mouli Movie Trailer Out: అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసిన సినిమా ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా నేడు లవ్ మౌళి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
హీరో తాడు సాయంతో జలపాతం పైకి ఎక్కుతున్న సన్నివేశంతో లవ్ మౌళి ట్రైలర్ ఆరంభం అయింది. ‘పట్టపగలు కూడా వెలుతురు పడని ఈ గుహ లాంటి గుండె నాది’, ‘ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు.. ఎంత సంపాదిస్తాన్నామో చూసి పెళ్లి చేసుకుంటారు.. దీంట్లో లవ్ ఎక్కడుంది’, ‘నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలియపోవడం ఏంటి?’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్‌లో బోల్డ్ కంటెంట్ బోలెడుంది.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
Also Read: Mahesh Babu-Venkatesh: చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!
ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో లవ్ మౌళి చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి.. ప్రేమించే వ్యక్తి దొరికితే ఎలా మారతాడు? అనే విషయాన్ని బోల్డ్‌గానే చెప్పినట్లు ఉంది. 2021లో ప్రారంభమైన లవ్ మౌళి సినిమా.. కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నవదీప్ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంపై నవదీప్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..