NHRC: పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారు
- లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు
- పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారు
- ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపైన కూడా కేసు నమోదు చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయట పెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారని NHRC దర్యాప్తు బృందం నిర్ధారించింది. 2024 నవంబర్‌లో ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజా విచారణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు.. అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌లో లగచర్ల నివాసితులలో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి, శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం వెల్లడించింది.
Also Read
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
నిరసన జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు, ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురిచేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రిపూట అరెస్టు చేయబడిన గ్రామస్థులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి, హింసించి.. మేజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్ట్ లో తేల్చి చెప్పింది.
Also Read:Tamil Nadu Governor: వీసీల సదస్సు ఏర్పాటు చేయాలన్న తమిళనాడు గవర్నర్.. మండిపడిన కాంగ్రెస్, సీపీఎం
రాజకీయ కక్షతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుని ఘటనతో సంబంధం లేకపోయినా పోలీసులు వారిని అరెస్ట్ చేసి హింసించారని కూడా కమిషన్ పేర్కొన్నది. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపైన కూడా కేసు నమోదు చేయలేదని అరెస్టులు కూడా జరగలేదని అని నివేదికలో వెల్లడించింది. ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని రిపోర్టులో NHRC దర్యాప్తు బృందం వెల్లడించింది.
తాజావార్తలు
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
ట్రెండింగ్
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!