లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయట పెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారని NHRC దర్యాప్తు బృందం నిర్ధారించింది. 2024 నవంబర్‌లో ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజా విచారణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు.. అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌లో లగచర్ల నివాసితులలో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి, శారీరకంగా…