RC16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీ గా వున్నాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే వుంది.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.వైజాగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తన తరువాత సినిమా చేస్తున్నాడు.
Read Also :Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..
RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఎప్పుడో లాంఛనంగా ప్రారంభం అయింది.అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాగానే రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ సినిమా లో రాంచరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్ తో నటించిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 మూవీతో పాటు ,ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే రాంచరణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రష్మిక నటించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.ఈ సినిమాలో రష్మిక పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే రష్మిక పాత్ర గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.