Narne Nithin’s Sri Sri Sri Raja Vaaru Movie censor completed: ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్, సంపద హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాను శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచింది. అంతేకాదు సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందుకుంది.
చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… నార్నె నితిన్ నటించిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. మా దర్శకులు సతీష్ వేగేశ్నకి మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో U/A సర్టిఫికెట్ పొందడం సంతోషంగా ఉంది. అన్ని హంగులతో మా చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నాం’ అని చెప్పారు.
Also Read: Jasprit Bumrah: సూర్యుడి రాకతో.. పాకిస్థాన్‌పై గెలవడం కష్టమే అనుకున్నాం: బుమ్రా
‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. శతమానం భవతి సినిమాతో సతీష్ వేగేశ్న నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్. అంతేకాదు ఇతడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది (లక్ష్మీ ప్రణతి సోదరుడు) కూడా.