Vijayawada: పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం.. హాజరైన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
- విజయవాడ పున్నమి ఘాట్ లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం
- రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ప్రముఖులు
- ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
- కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనిత.. సవిత.. కందుల దుర్గేష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఆమెతో పాటు.. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల సతీమణులు, వివిధ రంగాల మహిళా ప్రముఖులు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు.. విద్యుత్ కాంతులతో విజయవాడ పున్నమీ ఘాట్ శోభాయమానంగా ఉంది. దసరా పండుగ విశిష్టత చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త..
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. దసరా పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు.. పండుగ చేసుకోవడమంటే సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమేనని అన్నారు. ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది.. స్త్రీ శక్తిని తెలియచెప్పేదే దసరా పండుగ అని తెలిపారు. టెక్నాలజీ యుగంలో ఆడబిడ్డల విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి.. మహిళలు అంతరిక్షాలకు వెళ్తున్నారు.. రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. దేశానికి ఓ గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం.. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నా.. ఇప్పటికీ మహిళలపై చిన్న చూపు ఉందని పేర్కొన్నారు. కొన్ని అపోహలు, అలవాట్ల వల్ల మహిళా శక్తిని పూర్తిగా సమాజం ఉపయోగించుకోవడం లేదు.. మహిళా సాధికారత అనేది జరగాలని భువనేశ్వరి తెలిపారు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆద్దేనని అన్నారు. ఆడబిడ్డల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్శిటీని ప్రారంభించింది అన్న ఎన్టీఆర్.. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను తమ కాళ్లపై నిలబడేలా చంద్రబాబు కృషి చేశారన్నారు. మహిళలు ఏదైనా చేయగలరు.. ఎస్ వియ్ కెన్ డూ ఇట్ అని వ్యాఖ్యానించారు.
KCR : తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానముంది
హెరిటేజ్ నేను నడపగలనా అని తనకు అనుమానం కలిగిందని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు తనను ప్రోత్సహించారు.. హెరిటేజ్‌లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను.. కానీ తాను చేయగలనా అని మనస్తైర్యంతో ముందుకు సాగానని చెప్పారు. మహిళలు యొక్క శక్తిని వారు గ్రహించాలి.. ప్రతి ఒక్క సామాన్య స్త్రీ తనకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. పాలు అమ్మే రైతు నుండి వ్యాపారం చేసే మహిళ వరకు ప్రతి మహిళ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. చేనేత కార్మికులు వారు చేసే చేనేత హస్తకళ నైపుణ్యం ఎంతో గొప్పది.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని కోరుకుంటున్నాను.. రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు అందరూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని నారా భువనేశ్వరి తెలిపారు.
తాజావార్తలు
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!