టాలీవుడ్ హీరో నారా రోహిత్ అందరికీ సూపరిచతమే ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.. ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం.. అందుకే సినిమాకు క్రేజ్ బాగానే పెరుగుతుంది.. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ , టీజర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి
ఇక ఈ చిత్రంను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మించగా.. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్ మొదలగు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడంతో..మరో రెండు రోజుల్లో సినిమా రాబోతుందని అంత అనుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మేకర్స్ షాకింగ్ విషయాన్నీ ప్రకటించారు.. అసలు ఎందుకు ఇలా చేశారో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం వాయిదా పడింది.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..