Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యమని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో పాన్-ఐఐటీ (PanIIT) కాన్ఫరెన్స్ టీమ్ తో జరిగిన డిన్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు.. సీఎం చంద్రబాబు గురించి అందరికీ తెలుసన్నారు లోకేష్.. ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఒక్కో వెర్షన్‌తో మరింత మెరుగుపడుతుంటాయని.. అలాగే.. మన ముఖ్యమంత్రి కూడా ప్రతి వెర్షన్‌తో మరింత మెరుగవుతున్నారన్నారు.. ఇది ఆయన నాలుగో వెర్షన్. ప్రజా ప్రభుత్వంలో 50 శాతం మంది శాసనసభ్యులు తొలిసారి ఎన్నికైనవారే. అలాగే 25 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇప్పుడు సీనియర్ మంత్రిని. రాష్ట్రాభివృద్ధి కోసం మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం అన్నారు లోకేష్..
ఇక, సీఎం చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీతో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ మిషన్‌ను ప్రారంభించారన్నారు లోకేష్.. ఈ మిషన్ లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలిసి దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రపంచంలోనే ఉద్యానవన రంగంలో భారత్‌ను నెం.1 స్థానానికి తీసుకెళ్లడమే ఈ మిషన్ లక్ష్యం. ఏపీలో హార్టికల్చర్ నుంచి స్పేస్ వరకు, డ్రోన్ల నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు, డేటా సెంటర్ల వరకు ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతున్నాం. ఏపీలో మనం నూతన చరిత్రను సృష్టిస్తున్నాం. అంతా కలిసి మన లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ఏపీ మీకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తోందన్నారు.. ఇక్కడ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో వాటికి ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాలనుకుంటున్నామని.. పోటీతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్రం ఒక మంచి పని చేస్తే, మిగతా రాష్ట్రాలు కూడా దానిని అనుసరిస్తాయన్నారు.. అందువల్ల ఏపీ మార్గదర్శకంగా నిలవగలదని విశ్వసిస్తున్నా అన్నారు లోకేష్.. యూరప్, అమెరికా అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి 100 నుంచి 120 సంవత్సరాలు పట్టింది. దుబాయ్‌కు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు పట్టింది. సింగపూర్ కేవలం 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది. ఇక్కడ ఉన్న మేధోశక్తి, ప్రతిభ, సంకల్పం, సానుకూల నాయకత్వాన్ని గమనిస్తే.. భారత్‌ను కేవలం 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలమని నేను నమ్ముతున్నా. ఒక దశాబ్దంలోనే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారగలం. ఒక రాష్ట్రంగా ఏపీ ఈ మార్పునకు నాయకత్వం వహించాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!