NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: తెలంగాణ నుంచి ఏపీకి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా?

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా..? అంటూ నిలదీశారు నారా భువనేశ్వరి.. కాకినాడలో చంద్రబాబుకు మద్దతుగా జగ్గంపేట నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్వరి.. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అవసరం లేదు. నేను నడిపిస్తున్న కంపెనీలో రెండు శాతం వాటా అమ్మితే 400 కోట్లు వస్తుందని అంత దిగజారుడు పనులు చేసేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రపంచానికి హైటెక్ రంగాన్ని చూపించారు. చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసన్న ఆమె.. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు తప్పు చేయలేదన్నారు. తనతో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం అని.. ఏం తప్పు చేశారని ఆయనను జైలులో పెట్టారు.. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం మా కుటుంబానికి లేదని స్పష్టం చేశారు.

Read Also: Madhu Yashki Goud: పాతవారిని పక్కనబెట్టి.. కొత్తవారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదు..!

ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి.. ఎన్టీఆర్ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని వెల్లడించారు. రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని చక్కని శిల్పంగా మార్చారు.. నిరంతరం ప్రజల కోసమే ఆయన ఆరాటపడేవారు.. రాత్రింబవళ్లు కష్టపడే మనిషిని ఎందుకు అరెస్టు చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదన్న ఆమె.. రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే అడ్డుకున్నారు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా..? అంటూ నిలదీశారు నారా భువనేశ్వరి..