Dasara: యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ టీజర్‌కు ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు నేచురల్ స్టార్. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం నాని కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా నిలవనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడొక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమా మేకర్స్ తాజాగా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివిల్ చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రూ.70 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్‌తో సినిమా వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తి అయిందని, హీరోహీరోయిన్లు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
Ravanasura: ‘రావణాసుర’ పోస్ట్ థియేట్రికల్ రైట్స్‌కు ఊహించని బిజినెస్
ఈ మూవీని తెరకెక్కిస్తున్న ఎస్‌ఎల్వీ సినిమాస్ ట్విటర్ అకౌంట్ ద్వారా టీజర్ రిలీజ్ విషయాన్ని తెలిపింది. జనవరి 30న మీ స్క్రీన్స్ పై అగ్గి పుట్టించడానికి దసరా టీజర్ వస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ టీజర్ రానున్నట్లు చెప్పింది. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!