Nani : ‘వేణు యేల్దండి’ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో కమెడియన్ గా పరిచయం అయి వరుస సినిమాలలో నటించాడు. వేణు ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వేణు పలు సినిమాలలో కమెడియన్ గా ఆఫర్స్ అందుకున్నాడు.అయితే కొన్నాళ్ళకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన వేణు దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అద్భుతమైన కథను సిద్ధం చేసుకొని నిర్మాత దిల్ రాజుకి వినిపించగా ఆ కథ దిల్ రాజుకి బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేసారు.అలా వచ్చిన సినిమానే “బలగం”.ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Read Also :Tamannaah : అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పేంటి.. నటిగా అది నాకు అవసరం..
ఒక కుటుంబంలోని బంధాలను గురించి దర్శకుడు వేణు ఎంతో ఎమోషనల్ గా చెప్పాడు.ఈ సినిమాతో వేణుకి ఊహించని క్రేజ్ వచ్చింది.ఎందరో సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూసి దర్శకుడు వేణుని ప్రశంసించారు.ఇదిలా ఉంటే వేణు టాలెంట్ చూసిన దిల్ రాజు నేచురల్ స్టార్ నానితో తన రెండో సినిమాను లాక్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వేణు ఓ స్టోరీని సిద్ధం చేసుకొని నానికి వినిపించగా వేణు చెప్పిన స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టినట్లు ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అయితే ఈ స్టోరీకి “ఎల్లమ్మ” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.