Site icon NTV Telugu

Balakrishna: ముంబై స్కూల్లో బాలయ్య సందడి

Balakrishna

Balakrishna

Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు.

READ MORE: MLA Raja Singh: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

బాలకృష్ణ సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు. ఆయన ప్రోత్సాహకరమైన సందేశాలు విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. విద్యార్థుల ఆనందభరిత వాతావరణం పాఠశాల ప్రాంగణంలో సందడిని నింపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడి, జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణప్రసాద్ బాలకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్శన విద్యార్థులకు ఒక చిరస్థాయి జ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు తెలిపారు. బాలకృష్ణ స్ఫూర్తిదాయక మాటలు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని పాఠశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

Balakrishna1

Exit mobile version