Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…