తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. కార్యకర్తల కష్టమే 41ఏళ్ళ తెలుగుదేశం పార్టీ అన్నారు బాలయ్య. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ కార్యకర్తలు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలి.పాత తరానికి గుర్తుండేది ఎన్టీఆర్ పాలన, సినిమాలు, మాత్రమే.ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పును ఖండించిన బాలకృష్ణ..ప్రాంతాలు వేరైనా.. తెలుగువారంతా ఒక్కటే అన్నారు. తెలుగు గడ్డలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత ఎన్టీఆర్ ది అని కొనియాడారు.
రాజకీయాలంటే.. ఎన్టీఆర్ ముందు.. ఎన్టీఆర్ తర్వాత అన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేదల ఆకలి తీర్చిన అన్న.. బరోసా ఇచ్చిన అమ్మ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే మహిళలకు ధైర్యానిచ్చిన అన్న. ..ఎన్టీఆర్ కు మరణం లేదు.. నిత్యం వెలిగే దీపం ఎన్టీఆర్.. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధినే ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో సమూల మార్పులకు కారణం ఎన్టీఆర్..పేదలకు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్ళ నిర్మాణం ఎన్టీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. పేరు పేరున టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాలయ్య బాబు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: IPL 2023 : ఐపీఎల్ లో ఈ రికార్డులు ఎంఎస్ ధోనికే సొంతం..
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళిన నాయకుడు ఎన్టీఆర్. పేదల కోసం లక్షల ఇళ్ళు నిర్మించిన ఘనత ఎన్టీఆర్ దే. రెండు రూపాయల బియ్యం ఇవ్వటం వలనే పేదల కడుపు నిండా తిండి తిన్నారు. చంద్రబాబు వేసిన అభివృద్ధి బాటతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన విజన్ విజన్ వలనే పేదల పిల్లలు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. టీడీపీ జెండాను ప్రతి ఇంటికి తీసుకెళ్ళే బాధ్యత కార్యకర్తలదే. రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Sabitha Indra Reddy : విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండి