ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. ఈక్వస్ట్రియన్(గుర్రపు స్వారీ) విభాగంలో బంగారు పతకం సాధించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించడం గమనార్హం. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది.