NTV Telugu Site icon

Akhanda 2: కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్!

Akanda

Akanda

Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేపథ్యంలో అఖండ 2 చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది.

Also Read: Cyber Scams: పండుగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్త సుమీ

ఇకపోతే, అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే పాత్రను అఖండ 2లో కొనసాగించనున్నారు. ఈసారి కుంభమేళా నేపథ్యంలో అఖండ పాత్రను మరింత దైవీమయంగా చూపించలన్న నేపథ్యంలో.. అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్టుగా, త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టుగా ప్రత్యేకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. లక్షలాది భక్తులతో ఉన్న కుంభమేళాలో రియల్ లొకేషన్లలో బాలయ్యను షూట్ చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. నిజానికి ప్రయాగ్ రాజ్ కుంభమేళా వంటి వైభవమైన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేయడం సినిమాకు బలాన్ని చేకూర్చనుంది.

Also Read: YS Jagan London Trip: నేడు లండన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు..

ఇప్పటికే అఖండ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక సూపర్ హిట్ కాంబో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో ఇది 4వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక బాలకృష్ణ సినిమా అంటే ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన త‌మ‌న్ ఈ సినిమాతో మరోసారి బాలయ్య అభిమానులను అలరించనున్నాడు. అఖండ 2కు సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలై చిన్న మ్యూజిక్ గ్లింప్స్‌తో అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక సినిమాను దసరా సందర్భంగా 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. బాలయ్య రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. అఖండ 2 రాబోతున్న దసరా పండుగకు సినిమా థియేటర్లలో సందడి కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేసిన చిత్ర యూనిట్, బాలయ్య అభిమానులను మరోసారి ఫ్యాన్టాసీ ప్రపంచంలోకి తీసుకువెళ్లనుంది.

Show comments