Akhanda 2: కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్!
- అఖండ 2లో మరోమారు అఘోరా పాత్రలో కనువిందు చేయనున్న బాలకృష్ణ.
- కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్ కు ఏర్పాట్లు.
- అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేపథ్యంలో అఖండ 2 చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది.
Also Read: Cyber Scams: పండుగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్త సుమీ
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
ఇకపోతే, అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే పాత్రను అఖండ 2లో కొనసాగించనున్నారు. ఈసారి కుంభమేళా నేపథ్యంలో అఖండ పాత్రను మరింత దైవీమయంగా చూపించలన్న నేపథ్యంలో.. అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్టుగా, త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టుగా ప్రత్యేకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. లక్షలాది భక్తులతో ఉన్న కుంభమేళాలో రియల్ లొకేషన్లలో బాలయ్యను షూట్ చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. నిజానికి ప్రయాగ్ రాజ్ కుంభమేళా వంటి వైభవమైన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేయడం సినిమాకు బలాన్ని చేకూర్చనుంది.
#Akhanda2 – Thaandavam begins its shoot at the Maha Kumbh Mela in Prayagraj, capturing the true essence of faith and devotion 🔱
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/cZ91CUb3Wf
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 13, 2025
Also Read: YS Jagan London Trip: నేడు లండన్‌కు వైఎస్ జగన్ దంపతులు..
ఇప్పటికే అఖండ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక సూపర్ హిట్ కాంబో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో ఇది 4వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక బాలకృష్ణ సినిమా అంటే ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన తమన్ ఈ సినిమాతో మరోసారి బాలయ్య అభిమానులను అలరించనున్నాడు. అఖండ 2కు సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలై చిన్న మ్యూజిక్ గ్లింప్స్‌తో అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక సినిమాను దసరా సందర్భంగా 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. బాలయ్య రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. అఖండ 2 రాబోతున్న దసరా పండుగకు సినిమా థియేటర్లలో సందడి కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేసిన చిత్ర యూనిట్, బాలయ్య అభిమానులను మరోసారి ఫ్యాన్టాసీ ప్రపంచంలోకి తీసుకువెళ్లనుంది.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!