టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ లో మెరిసాడు..మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే.. మరోవైపు సామాజిక సేవ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటాడు మహేష్. ఇప్పటికే ఆయన కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌కు ఆయన కుటుంబసభ్యులు అంతా భాగమయ్యారు. ఇప్పటికే మహేష్ సతీమణి ఎంబీ ఫౌండేషన్ సేవలను దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ కు సంబంధించిన వివరాలను మరియు సేవా కార్యక్రమాలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వుంటారు.
ఇక మహేష్ తనయ సితార ఘట్టమనేని కూడా ఈ ఫౌండేషన్ కు తన వంతు సపోర్ట్ గా నిలుస్తుంది.. ఇటీవల ఆమె చేసిన యాడ్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఈ ఫౌండేషన్ కు ఇచ్చినట్లుగా ఆమె తెలిపింది. అలాగే తన పుట్టినరోజు బహుమతిగా కొందరు స్కూల్ విద్యార్థినీలకు సైకిల్స్ కానుకలుగా ఇచ్చిందట సితార. ఇక ఇప్పుడు మహేష్ తనయుడు గౌతమ్ తండ్రి దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం రెయిన్ బో హాస్పిటల్స్ ను సందర్శించి ఎంబీ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను గౌతమ్ పలకరించాడు. ఆ ఫోటోలను ఎంబీ ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడయా ఖాతాలలో షేర్ చేస్తూ గౌతమ్ ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది అని ఆమె పోస్ట్ చేసారు.ఎంబీ ఫౌండేషన్ లో భాగమైన గౌతమ్ ఆంకాలజి, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటారు..క్యాన్సర్ భారిన పడిన పిల్లలను కలిసి గౌతమ్ వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు. చిరునవ్వులు చిందిస్తున్న పిల్లలను చూసి గౌతమ్ ఎంతో సంతోష పడతారు. వారి అందరికి అండగా నిలిచినందుకు గౌతమ్ కు ధన్యవాదాలు అంటూ ఎంబీ ఫౌండేషన్ గౌతమ్ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.