హైదరాబాద్‌లోని నాంపల్లిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. నాంపల్లిలోని ‘బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్’ గోదాంలో మంటలు చెలరేగి దాదాపు నాలుగు గంటలు గడుస్తున్నా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్నీచర్ గోదాంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో, అదే భవనంలో నివసిస్తున్న మూడు కుటుంబాలు అగ్నికీలల మధ్య చిక్కుకుపోయాయి. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం ఆరుగురు లోపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో వాచ్మెన్ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అఖిల్ (7), ప్రణీత్ (11) తో పాటు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పెద్దవారు ఉన్నారు. దట్టమైన పొగలు , మంటల కారణంగా లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. సుమారు నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా సాగుతోంది.
CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
ప్రధాన రహదారిపై అగ్నిప్రమాదం జరగడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అబిడ్స్, నాంపల్లి, MJ మార్కెట్, , ఏక్ మినార్ మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఫైర్ ఇంజన్లు , అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లడానికి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు ఈ మార్గాల్లో రావొద్దని కోరుతున్నారు.
ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ (నుమాయిష్) జరుగుతుండటంతో జనసంచారం విపరీతంగా ఉంటుంది. అగ్నిప్రమాదం , ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా, ఈరోజు ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దని పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్‌కు రావాలని ప్లాన్ చేసుకున్న వారు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని, లేదంటే ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూనే, లోపల ఉన్న వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాలి.
RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!