Lagacharla Incident: లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పట్నం నరేందర్ రెడ్డి 50 వేల పూచీకత్తు, మిగతా వారు 20 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడు నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణ హాజరుకావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Kishan Reddy: అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు..