Tarakaratna Political: ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నా.. ఇంతలోనే ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarakaratna Political: హైదరాబాద్‌లో తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తారకరత్న మృతి చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. తారకరత్న కోలుకుని వస్తారని ఆశించామని, కానీ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తారని అనుకోలేదన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 23రోజులు తారకరత్న మృత్యువుతో పోరాడి చనిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తారీఖుకు 40సంవత్సరాలు వస్తాయని.. అతి చిన్న వయసులో కన్నుమూయడం శోచనీయమన్నారు.
Read Also: Tarakaratna : ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.. అప్పట్లో సంచలనం
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ఒక మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తిని ఇలా మధ్యలోనే అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని తారకరత్న తనతో చెప్పినట్లు వెల్లడించారు. ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉండేవారన్నారు. దీంతో ఆయనకు అవకాశం ఇద్దామనుకున్నామని వెల్లడించారు. దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని ఆయనతో చెప్పానని తెలిపారు. ఈలోపే తారకరత్న చనిపోవడం బాధాకరమన్నారు. తారకరత్న పిల్లలను చూస్తే చాలా బాధగా ఉందని.. భగవంతుడు ఆ కుటుంబానికి అన్నివిధాలా సహకరించాలన్నారు. తాము కూడా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read Also:Taraka Ratna – NTR : ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలిచిన ఎన్టీఆర్
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..