ఏపీలో వైసీపీ టీడీపీ నేతల మధ్య తీవ్రమయిన స్థాయిలో మాటల యుద్ధం సాగుతూ వుంది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ నేతలపై మండిపడ్డారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చూస్తే వైసీపీకి వెన్నులో వణుకు మొదలైందన్నారు. 30 రోజులకు 12 కేసులు పెట్టడం ఏంటి..? అని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.
Read Also: Devineni Uma: 2024లో వైసీపీకి వచ్చేవి 175 సీట్లు కాదు
పోలీసులే ఫిర్యాదు దారులు కావడం దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. గన్నవరం, అనపర్తి ఇలా ప్రతి దాంట్లో పోలీసులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ ఎవరిని వదిలిపెట్టడు…చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారిని వదిలిపెట్టడు.నారా లోకేష్ అందరి లెక్కలు సరిచేస్తాడు. ఇక లోకేష్ పై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని నక్కా ఆనందబాబు సవాల్ విసిరారు.
Read Also: Today Stock Market Roundup 01-03-23: హమ్మయ్యా. 8 రోజుల తర్వాత ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు