Naga Vamshi : ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల మీద నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అధిక ధరల కారణంగా సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది. మరోపక్క ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి, నిర్మాతలు బతకాలంటే దానికి తగ్గట్లు రేట్లు ఉండాలని మరో వాదన కూడా ఉంది. అందుకే పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే, వారం పది రోజుల పాటు రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు నిర్మాతలు. కానీ ఈ అధిక రేట్ల కారణంగా ఇటీవల జనాలు థియేటర్లలోకి రావడం తగ్గిపోయారన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఇప్పుడు థియేటర్లలో టికెట్ రేట్లు ఎక్కువేమీ లేవని అన్నారు. మూడు గంటల వినోదం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అని జనాలను ప్రశ్నించారు. 1500 రూపాయలు ఖర్చు పెడితే నలుగురు సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చని సూచించారు.
Read Also:CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ఫాక్స్‌కాన్ పనుల పురోగతిపై సమీక్ష
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒక ఫ్యామిలీలో నలుగురు కలిసి సినిమాకు వెళ్తే, సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ కి రూ.250 లెక్కన రూ. 1000 అవుతుంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి రూ. 500 అనుకున్నా 1500 అవుతుంది. 1500 రూపాయలకు మూడు గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది?. ఆంధ్రా, తెలంగాణ, యూఎస్ లలో అదే పదిహేను వందలకు అన్ని గంటలు ఎంటర్టైన్ చేసే ప్లేస్ ఏముందో చెప్పండని జనాలకే ప్రశ్న వేశారు. షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిమ్మల్ని మూడు గంటలు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి 1500 తీసుకుంటే తప్పేంటి?. ఇవాళ్టికీ చీప్ గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమేని నాగవంశీ చెప్పారు.
Read Also:Karimnagar Manasa Devi Temple: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక స్వయంభు ఆలయం..
ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందనే ఎక్కువ రేట్లు అడుగుతున్నాం. సినిమా మీద అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాం కాబట్టే ప్రభుత్వం నుంచి రేట్లు పెంచుకుంటామని పర్మీషన్ తెచ్చుకుంటున్నామన్నారు. దాని వల్ల జనాలకేమీ అన్యాయం చేయడం లేదు. నేను టికెట్ రేట్ 1000 పెడితే తప్పు. కానీ నేను ‘దేవర’ సినిమాకు పెట్టింది రూ.250లు మాత్రమే అన్నారు. ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు మాత్రమే కదా అవుతుంది. నెలకు మహా అయితే రెండు సినిమాలు చూస్తారు.. ఎవరూ 20 సినిమాలు చూడటం లేదు కదా అని నాగవంశీ అన్నారు. అలాగే ఓటీటీలోకి నాలుగు వారాలకు సినిమా వస్తే తప్పేంటని ప్రశ్నించారు. వాళ్లు మేము అడినంత డబ్బులు ఇస్తున్నారు కాబట్టే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయినా సినిమాలకు నాలుగు వారాలు తక్కువ సమయమేమీ కాదు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.