తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు నిఖిల్ కార్తికేయ 2 వంటి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాడు.అలాగే మరో యంగ్ హీరో అడివి శేషు హిట్ 2 సినిమాతో మంచి విజయం సాధించాడు.ఈ ఇద్దరు యంగ్ హీరోలు మంచి కథలను ఎంపిక చేసుకొని అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు. కానీ యంగ్ హీరో అయిన నాగ శౌర్య కి మాత్రం అసలు కాలం కలిసి రావడం లేదు.తాను చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారి డిజాస్టర్లు గా మారుతున్నాయి.ఈయన చివరి హిట్ సినిమా ఛలో.ఈ సినిమా తో నాగశౌర్య మంచి విజయం అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.
దాంతో రీసెంట్ గా తీసిన రంగబలి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సత్య కామెడీ తో ఎంతో ఫన్నీ గా నడిచిన సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా సీరియస్ గా సాగుతుంది కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది.ఇక దానితో ప్రస్తుతం నాగ శౌర్య చేసే సినిమాల మీద ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.అర్జెంటు గా నాగ శౌర్య కు బ్లాక్ బస్టర్ హిట్ పడితే తప్ప ఆయన కెరీర్ సెట్ అవ్వదు. రంగబలి సినిమా ప్లాప్ తర్వాత నాగ శౌర్య మరో కొత్త సినిమా కు కమిట్ అవ్వలేదు.ప్రస్తుతం నాగ శౌర్య ఎలాంటి సినిమాను చేయాలి అని సంధిగ్ధం లో వున్నాడు.ఈ సమయంలో నాగ శౌర్య ఏదైనా సినిమాకు కమిట్ అయిన కూడా మళ్లీ ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అని నాగ శౌర్య ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.దీనితో మంచి కంటెంట్ వున్నా సినిమాలో నటించాలని నాగ శౌర్య చూస్తున్నట్లు తెలుస్తుంది.