Thandel : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా తండేల్. ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో నాగా చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాతో నాగ చైతన్య, సాయి పల్లవి హ్యాటిక్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా.. అందుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే తండేల్ సినిమా నుంచి శుక్రవారం గ్లింప్స్ విడుదల చేస్తామని ప్రకటించి.. టెక్నికల్ సమస్యలు అని చెప్పి నిన్నే రెండు సార్లు వాయిదా వేసి అభిమానులని నిరాశ పరిచారు. మళ్ళీ నేడు రిలీజ్ చేస్తామని ప్రకటించి.. ఎట్టకేలకు తాజాగా తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Read Also:MP Kesineni Nani: త్వరలో టీడీపీకి రాజీనామా.. టార్గెట్ చేరడానికి మా వాళ్లు ఏం చెబితే అదే చేస్తా..
తండేల్ కథను చిత్రయూనిట్ ముందే చెప్పేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో పాక్ వాళ్లు పట్టుకుంటే ఎలా బయటకు వచ్చారనేది కథ. గతంలో జరిగిన యదార్థ ఘటనలతో తెరకెక్కిస్తున్నారు. దానికి ప్రేమ కథ, దేశభక్తి అంశాలను జోడించి తండేల్ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్నారు. తాజగా విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య మొదటిసారి ఫుల్ గడ్డంతో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక గ్లింప్స్ చివర్లో సాయి పల్లవిని చూపించి ఆమె అభిమానులను కూడా ఆనందపరిచారు.
Read Also:Delhi : ప్రియుడిని ప్రేమతో ఇంటికి పిలిచింది.. పెట్రోల్ పోసి నిప్పెట్టింది