2026 కొత్త ఏడాది మొదలవ్వడమే అక్కినేని అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్‌తో మొదలైంది. ప్రస్తుతం నాగచైతన్య తన కెరీర్ విషయంలో ఐడియాలజీని పూర్తిగా మార్చేసి, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ‘తండేల్’ సినిమా తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న చైతూ, తన తర్వాతి సినిమాను కూడా లైన్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ‘బెదురులంక’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్లాక్స్‌తో చైతన్య జతకట్టబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : MSVG : 9 రోజులు 9 ఊర్లలో ‘శంకర వరప్రసాద్ గారు’ హంగామా!
ఈ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయని, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘వృషకర్మ’ ముగింపు దశలో ఉండటంతో, నాగచైతన్య వెంటనే క్లాక్స్ డైరెక్షన్‌లో నటించే అవకాశం ఉంది. మరి ఈ కొత్త కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.