NC24 : నాగచైతన్య కొత్త సినిమాను పోస్టర్ తో అనౌన్స్ చేసిన మేకర్స్
- చైతూ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
- NC24పేరుతో షూటింగ్
- విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NC24 : యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. GA2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాతో చైతూ మరో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. తండేల్ సినిమా పూర్తి కాగానే, నాగ చైతన్య తన తదుపరి చిత్రం షూటింగ్ డిసెంబర్ 12 న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని అందిస్తుంది. ఇందులో మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే కథానాయికలుగా కనిపించనున్నట్లు సమాచారం.
Read Also:Jayamangala VenkataRamana: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దాదాపు రూ. 110 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ.30 కోట్లు వెచ్చించనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ చిత్రాన్ని అగ్రశ్రేణి థ్రిల్లర్‌గా రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కథను నార్త్ ఇండియాలోని పలు లొకేషన్లలో చిత్రీకరించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ లొకేషన్లు కథకు చాలా కీలకమని, ప్రేక్షకులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించగలవని అంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందే నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. మేకర్స్ కథతో పాటు సాంకేతిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో మరో పెద్ద రికార్డుగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చైతూ తన మార్కెట్‌ని మరో స్థాయికి తీసుకెళ్తాడని తెలుస్తోంది.
Read Also:Maharashtra Election Results: వెనుకంజలో ఆదిత్య ఠాక్రే..
తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు కానుకగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో గద్ద కంటిలో యోధుడిగా నాగచైతన్య కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఓ వారియర్ సినిమాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. NC24 పేరుతో సినిమా తెరకెక్కుతుంది. ప్రతిష్టాత్మక, భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ((SVCC) సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను అందించనుంది. ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మాణం చేస్తుంది ఎస్వీసీసీ సంస్థ.
He'll delve into depths darker than ever 🌑#NC24 – An excavation into Mythical Thrills & shivers. 💥
Happy Birthday Yuva Samrat @chay_akkineni 🌟
Directed by @karthikdandu86 🎬
Produced by @SVCCofficial & @SukumarWritings@BvsnP @AJANEESHB @Shamdatdop @NavinNooli pic.twitter.com/87Pt1kLCFJ— SVCC (@SVCCofficial) November 23, 2024
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!