NTV Telugu Site icon

Nadendla Manohar: బ్యానర్లు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లం అయిపోయాం అనుకోవద్దు..

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు. చిన్న వర్షం పడితే రాష్ట్రంలో మొదటి ఫొటో మచిలీపట్నం నుండే వచ్చేదని ఆయన వెల్లడించారు. టీడీపీతో పొత్తుకి వెళ్లాం , రెండేళ్ల క్రితం అడుగు వేశారు.., ఇప్పటంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఆయన మన భవిష్యత్ కోసమే ఆ ‌నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల తెలిపారు. మచిలీపట్నంలో అభ్యర్థి ఎవరు, ఎవరు పోటీ చేస్తారు అనేది మనం తీసుకొనే నిర్ణయం కాదు పవన్ సమయం వచ్చినప్పుడు తీసుకుంటారని తెలిపారు.

Also Read: Times Now Survey: లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీదే హవా.. మొత్తం స్థానాలకూ!

అవనిగడ్డలో ఐదేళ్లుగా ఇన్చార్జ్ లేరు , కాని కార్యకర్తలతో సభ పెట్టాం , ఎవరైనా ఇలా సభ పెట్టగలరా అంటూ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. సోషల్ మీడియాను మన కార్యక్రమాలు కోసం ఉపయోగించండి.. విమర్శల కోసం కాదన్నారు. పార్టీ ఆదేశాల‌ మేరకు మనం నిలబెట్టే అభ్యర్థి కోసం బూత్ లెవెల్‌లో కష్టపడాలన్నారు. టీడీపీ ఏ కార్యక్రమం పెట్డిన వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అంటూ నేతలకు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండి ఓటు హక్కు పెట్టుకున్న వాళ్లు 5 వేల నుంచి 8 వేలమంది ఉన్నారు వారందరిని కదిలించండి అంటూ నేతలకు సూచించారు.