జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై రాష్ట్ర సదస్సు జరిగింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పాట్లు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదు.ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడండి.జనసేన ఎప్పుడూ జనం పక్షానే నిలబడింది.. నిలబడుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుంది.జగన్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా..?ఆర్డినెన్స్ తేవడం ద్వారా పూర్తిగా అమలైపోతుందా..?ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..?ఎంతమంది ఆర్ధిక ప్రగతి సాధించారు..?ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను పొడిగించడం కాదు.. పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలి.
Read Also: Pathaan: బాలీవుడ్ పతనాన్ని ‘పఠాన్’ ఆపినట్టేనా..?
సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో దశాబ్దాలుగా ఉంటూనే ఉన్నాయి.రాజకీయ వ్యవస్థలో ఎవరైనా అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇవ్వకపోతే ఎలా..? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను పూర్తిగా అమలు చేసి, నిధులిస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.అందరికీ వీటిపై అవగాహన కల్పించి, అభిప్రాయాలు పంచుకుకోవాలనే ఈ సదస్సు ఏర్పాటు చేశాం.అన్ని పట్టణాలు, పల్లెల్లో తిరిగి వారి హక్కుల గురించి వివరించాలి.చట్టం అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనాన్ని చెప్పాలి.
జగన్ ప్రభుత్వం అరవై శాతం కూడా నిధులు ఇవ్వకుండా దారి మళ్లించారు. బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు, అధికారాలు కల్పించాలి.ప్రతేడాది నిధుల వినియోగం పై చర్చ జరగాలి, ఆడిట్ చేయాలి.గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకిచ్చే నిధులు లాగేశారు.నేడు ఒకవీధి లైటు పోయినా వేయలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారన్నారు. మన బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే సోషల్ ఆడిట్ అవసరం. ప్రభుత్వ వైఫల్యాలను ను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా ఖాకీలతో కొట్టిస్తున్నారు.అన్యాయం, అక్రమాలను ప్రశ్నించే యువత గొంతు నొక్కాలని చూస్తున్నారు.జగనుకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా సబ్ ప్లాన్ విషయంలో చొరచ చూపాలన్నారు.
Read Also: Bandi Sanjay : పరేడ్ గ్రౌండ్‌లోనే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి