టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ.. ఈ సినిమాను విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్నాడు.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే అల్లరి నరేశ్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా సామి రంగ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుంది. చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది.దానిలో భాగంగా మరో పాత్రను కూడా పరిచయం చేశారు.ఈ సినిమాలో అల్లరి నరేశ్ అంజిగాడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంజిగాడు గ్లింప్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
కాగా ఇప్పుడు అంజిగాడి ప్రాణం ఎవరో తెలియజేస్తూ మేకర్స్ మిర్నా మీనన్ లుక్ విడుదల చేశారు. మిర్నా మీనన్ ఈ మూవీలో మంగ పాత్రలో కనిపించనుంది. నెత్తిన మల్లెపూలు, చేతిలో సద్దిమూటతో పొలంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.నా సామి రంగ ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకుంది. ఇప్పటికే నా సామి రంగ టైటిల్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది. ఈ సాంగ్‌కు డైరెక్టర్ విజయ్ బిన్ని అండ్ టీం డ్యాన్స్ చేసిన వీడియోను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ షేర్ చేయగా ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న నా సామి రంగ మూవీ కి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు.విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ విడుదలైన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
మా అంజి గాడి ప్రాణం❤️
Introducing Gorgeous @mirnaaofficial as మంగ🤩🔥
Witness her enthralling performance in theatres from January 14th!😍#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun… pic.twitter.com/4ksj0cuhjq
— BA Raju's Team (@baraju_SuperHit) January 4, 2024