ప్రతి శుక్రవారం ఓటీటిలో సినిమాల సందడి మాములుగా ఉండదు.. చిన్న హీరో సినిమా నుంచి పెద్ద హీరో సినిమా వరకు అందరి సినిమాలు ఇక్కడ సందడి చేస్తాయి.. ఈరోజు ఏకంగా ఓటిటిలో 20 సినిమాలకు పైగా విడుదల కాబోతున్నాయి.. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. హన్సిక పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు..
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ‘దేశముదురు’ అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. దాంతో తమిళంలో వరస మూవీస్ చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే తెలుగు సినిమా చేయగా, నవంబరు 17న థియేటర్లలో విడుదలైంది.. థియేటర్లలో ఓ మాదిరిగా పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయబోతుంది..
అయితే థియేటర్లలో ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది.. ఇప్పుడు దాదాపు నెలన్నర తర్వాత సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి(హన్సిక).. స్కిన్ మాఫియా వలలో ఎలా పడింది? ఆ మాఫియాను ఎదుర్కొని ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించిందన్నదే ఈ సినిమా కథ. ఈ వీకెండ్ ఏదైనా థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా బెస్ట్ చాయిస్ అవుతుంది..