SS Thaman: గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్కు వేస్తూ మ్యూజిక్ లో సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్న తమన్ ఏ కొద్ది సమయం గడిపిన వెంటనే క్రికెట్ గ్రౌండ్ లో ప్రత్యక్షమవుతాడు. దీనికి కారణం తమన్ కు క్రికెట్ పై ఉన్న అభిమానం అలాంటిది. అదే కాదండోయ్.. తమన్ మంచి బ్యాట్స్మెన్ కూడా. సీసీఎల్ లాంటి ప్రముఖ టోర్నమెంటులో కూడా తమ తనదైన బ్యాటింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇకపోతే తాజాగా తమన్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏకంగా సెంచరీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Rahul Gandhi: సమాజాన్ని విషపూరితం చేస్తున్న బీజేపీ- ఆర్ఎస్ఎస్..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో తమన్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. కేవలం 40 బంతుల్లోనే 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి సెంచరీ సాధించారు. ఈ విషయాన్ని థమన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ను చూసిన అభిమానులు “మ్యూజిక్‌తో స్ట్రింగ్స్ సునామీ, బ్యాట్‌తో రన్స్ సునామీ తమన్ కు సాధారణమే” అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ క్రికెట్ ఫర్ కాజ్, ఆపరేషన్ సిందూర్, జైహింద్, సినీ హీరోస్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక కారణాలకు అంకితం చేస్తున్నట్లు కనపడుతోంది. ఇంకెందుకు ఆలశ్యం తమన్ ససెంచరీ వీడియోను మీరుకూడా చూసేయండి.
108* of 40 Balls at Our #RajivGandhiStadium 🏟️#Uppal TODAY 💪🏾❤️⚡️⚡️⚡️
Century yay 🥳 🙌🏿 https://t.co/oUrj9mkdtI
— thaman S (@MusicThaman) October 9, 2025