ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ లో రామ్ తెలంగాణ స్లాంగ్ తో అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.ఈ సినిమా కు పూరి టేకింగ్ తో పాటు ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ గా నిలిచింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించి ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్ర ను పోషించాడు మణిశర్మ. ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ సక్సెస్ కావడం తో ప్రస్తుతం పూరి జగన్నాథ్ , రామ్ హీరోగా డబల్ ఇస్మార్ట్ పేరు తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కొనసాగింపు గా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా వరకు షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ కి మరోసారి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడం తో ఈ మూవీ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరి జగన్నాధ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో భారీ బడ్జెట్ తో లైగర్ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. నిర్మాతలకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. దీనితో రామ్ తో తెరకెక్కించే డబల్ ఇస్మార్ట్ సినిమా ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్..