జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉండబోతోందన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ రాస్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని, కాంగ్రెస్ ఇండియా కూటమి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. హిందు వ్యతిరేక శక్తులతో కలిసి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ రాముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి పనిచేస్తోందని, హిందు వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారని ఆయన వెల్లడించారు.…