Mumbai Indians: ఐపీఎల్ 2024లో అత్యంత విమర్శలు ఎదుర్కొంటున్న జట్టుగా ముంబై ఇండియన్స్ టీమ్ నిలిచింది. ఎందుకంటే.. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మనున కాదని హార్థిక్ పాండ్యాను టీమ్ కెప్టెన్ గా ఎంపిక చేయడంతో రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జట్టు యాజమాన్యంతో పాటు హార్థిక్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రోహిత్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న ( ఆదివారం ) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపించింది.
Read Also: Landslide : హిమాచల్‌లో విరిగిపడిన కొండచరియలు.. తొక్కిసలాటలో ఇద్దరి మృతి
అయితే, హార్థిక్ పాండ్యా టాస్ వేసేందుకు గ్రౌండ్ లోకి వచ్చిన సమయంలో స్టేడియంలోని రోహిత్ ఫ్యాన్స్ రోహిత్ రోహిత్ అంటూ అరిచారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ సారథి కేవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. ఒక టీమిండియాకు చెందిన వ్యక్తిపై ఇంతలా అభిమానులు కోపం చూపించడం ఇప్పటి వరకు చూడలేదు అని పేర్కొన్నారు. అయితే, గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపించింది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బూమ్రా ఒక గ్రూప్ గాను.. ఇషాన్ కిషన్- హార్థిక్ పాండ్యా మరో గ్రూప్ గానూ ఉండటం చూడోచ్చు.
Read Also: The Goat Life : ‘ది గోట్ లైఫ్ ‘ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊహించని రెస్పాన్స్..
ఇక, రోహిత్ శర్మ ఎప్పుడూ స్లీప్ లేదా బ్యాటర్ కు దగ్గర ఫీల్డింగ్ చేస్తుంటాడు.. అలాంటి రోహిత్ ను హార్థిక్ పాండ్యా బౌండరీ లైన్ దగ్గరకు పంపించాడు. రోహిత్ ను కావాలనే హార్దిక్ అవమానపర్చాడంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. తమ కెప్టెన్ ఎప్పటికీ రోహిత్ శర్మనే అంటూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కొందరు అభిమానులు ఫ్లకార్డులను ప్రదర్శించారు.
More mischief https://t.co/nfL1djJK5o pic.twitter.com/5CdrXoFuBe
— Vishal Misra (@vishalmisra) March 24, 2024