మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘ది గోట్ లైఫ్’(ఆడుజీవితం).ఈ సినిమా గురువారం (మార్చి 28) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.అయితే ఆదివారం (మార్చి 24) నుంచి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ది గోట్ లైఫ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కేరళలో బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే రూ.కోటి మార్క్ అందుకోవడం విశేషం. తొలి 13 గంటల్లోనే ఈ మూవీ 63 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి రోజే రూ.1.5 కోట్లు వచ్చాయంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంతో పాటు వివిధ భాషల్లో రిలీజ్ కానుంది.
ఎప్పుడో 2008లో అనుకున్న ఈ సినిమా మొత్తానికి 16 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ట్రైలర్ తో పాటు ప్రమోషన్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ది గోట్ లైఫ్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్.. నిజజీవితంలో సౌదీ అరేబియాలో బానిసగా ఉన్న నజీబ్ అనే కేరళకు చెందిన వ్యక్తి పాత్రను పోషించాడు.90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)మూవీని తెరకెక్కించాడు.ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. గోట్‌లైఫ్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.