Landslide : హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ హోలా మొహల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరోవైపు మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్‌లోని మేడిలో హోలీకి సంబంధించి హోలా మొహల్లా జరుగుతోంది. గాయపడిన వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
Read Also:BJP: సందేశ్‌ఖాలీ బాధితురాలికి బీజేపీ ఎంపీ టికెట్..
హోలీ రోజున సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అంబ్‌లోని మేడి మేళా సెక్టార్ నంబర్ 5లోని చరణ్ గంగా వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. పర్వతం నుండి రాళ్లు పడటం చూసి భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో పాటు చరణ్ గంగలో స్నానం చేస్తున్న తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా అందులో ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Read Also:Rohit -Hardik Pandya Fans Fight: స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్న రోహిత్- హార్దిక్ ఫ్యాన్స్..