NTV Telugu Site icon

Mudragada vs Daughter: తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్‌ కామెంట్స్..!

Mudragada

Mudragada

Mudragada vs Daughter: తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్‌ కామెంట్స్ చేశారు.. తాజాగా, ముద్రగడ వ్యవహార శైలి, సవాళ్లపై స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు ఆయన కూతరు క్రాంతి.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. దీంతో.. తన కూతురు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.. నా కూతురుకు పెళ్లి అయ్యింది.. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ.. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీగా పేర్కొన్నారు. నన్ను నా కూతురుతో కొంతమందితో తిట్టించారని మండిపడ్డారు.. ఇది బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని చెప్పుకొచ్చారు. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరాను.. ఇక పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్న సీఎం వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Flipkart Offers 2024: ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు!

మరోవైపు.. నేను పదవుల కోసం పాకులాడను అని స్పష్టం చేశారు ముద్రగడ.. ఏ పదవులు కూడా అడగనన్న ఆయన.. నేను సేవకున్ని మాత్రమే అన్నారు. నా కూతురి వ్యాఖ్యలకు బాధపడిన భయపడను.. నా కూతురు.. ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని పేర్కొన్నారు.. ఇక, నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు.. ఎవరు బెదిరించినా.. బెదిరిపోను జగన్ కి సేవకుడిగా ఉంటాను.. నా కూతురికి, నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు.. బెదిరిపోను అని స్పష్టం చేశారు ముద్రగడ పద్మనాభం..

Read Also: Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..

కాగా, ముద్రగడ పద్మనాభంకు షాక్‌ ఇస్తూ.. ఆయన కూతురు క్రాంతి ఓ వీడియో చేయడం చర్చగా మారింది.. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదన్న ఆమె.. తాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇక, వీడియోలో క్రాంతి ఏం మాట్లాడిందనే విషయాల్లోకి వెళ్తే.. అందరికీ నమస్కారం.. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా మా నాన్న ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి… పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే.. నా పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు.. కానీ, ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదన్నారు.. అంతే కాదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదన్నారు క్రాంతి.. వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపుకోసం కష్టపడొచ్చు. కానీ, పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం మంచిది కాదని హితవుపలికారు.. ఇక, కేవలం పవన్‌ని తిట్టడానికే మా నాన్నని.. వైఎస్‌ జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా.. అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి.