Site icon NTV Telugu

Mudragada Padmanabham: వైసీపీలో చేరే ప్రసక్తే లేదు.. ముద్రగడ క్లారిటీ

Mudragada Padmanabham

Mudragada Padmanabham

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ఏ పార్టీలో చేరతారనే విషయంపై కొంచెం స్పష్టత వచ్చినట్లుగా అనిపిస్తోంది. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ముద్రగడ పద్మనాభం ఇష్టపడలేదని తెలుస్తోంది. తోట త్రిమూర్తులను రావొద్దని, వచ్చినా కలవనని పద్మనాభం చెప్పినట్లు సమాచారం. మీకు మాకు సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తాం, లేదా ఇంట్లో కూర్చుంటాము అని స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. వైసీపీలోకి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. వచ్చి మీసమయం వృధా చేసుకోవద్దు, మీ పని మీరు చూసుకోండి అంటూ వైసీపీకి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: YSRCP 3rd List: వైసీపీ మూడో జాబితా విడుదల.. కొత్త ఇంఛార్జులు వీరే..

ఇదిలా ఉండగా.. ముద్రగడ పద్మనాభంతో సంప్రదింపులు చేయమని పార్టీ హైకమాండ్ నుంచి తనకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు క్లారిటీ ఇచ్చారు. తాను ముద్రగడ పద్మనాభంను కలిసే ప్రయత్నం చేయలేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రచారాలు అన్ని అవాస్తవాలు అని కొట్టిపారేశారు. తాను మండపేటలో తన ఆఫీసులో ఉన్నట్లు తెలిపారు. ముద్రగడ టీడీపీలో చేరుతారు అని తాను భావించటం లేదన్నారు. ఆ పార్టీలో ముద్రగడకు అన్ని అవమానాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో చేరతారని తాను నమ్మటం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు.

 

టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తా..లేదా ఇంట్లో కూర్చుంటా : Mudragada Padmanabham l NTV

Exit mobile version